Friday, May 3, 2024

TS – 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం

తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా ఎస్‌ రమేశ్‌, ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా సురేందర్‌ రావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 అడిషనల్‌ డీసీపీగా రామారావు, సైబరాబాద్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీగా రెహ్మాన్‌, నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీగా శివకుమార్‌ నియమితులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement