Sunday, January 23, 2022

బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి

రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చ‌నిపోయాడు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ కు చెందిన ఆరిని అజయ్ (22) శాంతి నగర్ కు చెందిన వ్యక్తి ట్రాక్టర్ పై డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బొంపల్లి నుండి పెద్దపల్లికి వచ్చే క్రమంలో బంధంపల్లి శివారులో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌ అజయ్ అక్కడికక్కడే చ‌నిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని వ్యవసాయ బావిలో నుండి ట్రాక్టర్ ను వెలికి తీయించారు. ప్రమాదంలో అజయ్ మృతిచెందడంతో రాఘవపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News