Friday, May 24, 2024

MBNR :గద్వాలలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభకు…టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

గద్వాల, నవంబర్ 7(ప్రతినిధి ప్రభ న్యూస్)
గద్వాల్ జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మేళచెరువు రోడ్డు (ఐజా రోడ్డు సమీపంలో) వ్యవసాయ మార్కెట్ యార్డు వెనక భాగంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన సభను ఏర్పాటు చేశారు.

ఈ ప్రజా గర్జన సభకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ప్రజా గర్జన సభ స్థలాన్ని, హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఏఐసిసి కార్యదర్శి మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి సరిత. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే కాంగ్రెస్ పార్టీ ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గద్వాల నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement