Sunday, April 28, 2024

TS: నేడు భద్రాచలంలో సీతారాముల కల్యాణం

భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ మిథిలా మైదానంలో స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఇందు కోసం మిథిలా మండపాన్ని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

ఇప్పటికే శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి పురవీధులు మార్మోగుతున్నాయి. సీతారాములకు ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాల సమర్పించనున్నారు.

- Advertisement -

శ్రీరామ నవమి రోజున భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పూ ర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు చలువ పందిళ్లు వేశారు. ఈ ఏడాది భక్తుల అందరకీ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఉచిత భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు భద్రాద్రి రామయ్య కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రామయ్య కల్యాణాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement