Sunday, April 28, 2024

TS : నేడు సెల‌వు…. ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం…

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ‌ సెలవు ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసం 21వ తేదీన షహదత్ హజ్రత్ అలీ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇంతకుముందు మార్చి 31న సెలవు దినం కాగా, దానిని ఏప్రిల్ 1కి మార్చారు. హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.

- Advertisement -

ఈ సెలవుదినం ఐచ్ఛికంగా ప్రకటించారు. సాధారణమైనది కాదు. “ జీ.ఓ.ఆర్‌టి నెం 1633, జీఎ (ఎస్‌పీఎల్.ఈ) డిపార్ట్‌మెంట్. 12.12.2023లో జారీ చేసిన ఉత్తర్వుల పాక్షిక సవరణలో, సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను తెలియజేస్తూ ప్రభుత్వం ఇందుమూలంగా 1.04.2024ని ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా ఐచ్ఛిక సెలవుదినం 31.02.2024కి బదులుగా 1.04.2024 న ప్రకటించారు.” అని ప్రభుత్వ ఉత్తర్వు వచ్చింది.

అంతకుముందు.. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫితర్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం, ప్రభుత్వం ఏప్రిల్ 11, 12 తేదీలలో సెలవులు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 11 న ‘ఈద్-ఉల్-ఫితర్’, ఏప్రిల్ 12 ను ‘ఈద్ తరువాతి రోజు’గా పేర్కొంది. ఈద్-ఉల్-ఫితర్ పండుగ జరుపుకోవడం ఆకాశంలో నెలవంక దర్శనం ఆధారంగా ఉంటుంది.. కాబట్టి ప్రభుత్వం సెలవుకు సంబంధించిన డేట్ ను మార్చవచ్చు. నెలవంక ఏప్రిల్ 9న కనిపించినట్లయితే.. ఈద్ ఏప్రిల్ 10న జరుపుకుంటారు. లేకపోతే ఏప్రిల్ 11 న ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement