Saturday, April 27, 2024

Delhi: ఇది రాజకీయ కేసు – న్యాయపోరాటం చేస్తా – ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశ పూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శ‌నివారం మీడియా ప్రతినిథులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు.

బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశాం..

ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశామని కవిత తరఫు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పూర్తయిన రోజే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలన్నారు. కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. కేసులో ఉన్న మరికొన్ని అంశాలపై విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నలుగురి స్టేట్‌మెంట్లతో పాటు కిక్‌ బ్యాగ్స్‌ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారయన్నారు. డాక్టర్ల సూచనతో కవితకు మందులు, డైట్‌ ఇస్తున్నామని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వులో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement