Sunday, May 5, 2024

TS : మేడారంలో తిరుగువారం పండుగ…

మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహించనున్నారు.

- Advertisement -

దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. సమ్మక్క-సారలమ్మ పూజా మందిరాల్లో పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపరుస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా మందిరాలకు తాళాలు వేస్తారు. తిరిగి వచ్చే ఫిబ్రవరిలో మినీ జాతర సందర్భంగా పూజా సామగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement