Friday, June 14, 2024

HYD: దొంగల బీభత్సం.. భారీగా బంగారం, నగదు చోరీ

హైదరాబాద్ పరిధిలోని హబీబ్‌నగర్‌లో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ మేరకు తాళం వేసిన ఓ సాఫ్ట్‌వేరు ఉద్యోగి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షలతో నగదుతో ఉడాయించారు.

అదేవిధంగా అదే ప్రాంతంలో మరో ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి చొరబడి 2.5 తులాల బంగారం. రూ.3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement