Tuesday, June 18, 2024

TS: తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు…మంత్రి పొన్నాం ప్ర‌భాక‌ర్

ఫిబ్ర‌వ‌రి 16 చారిత్రాత్మ‌క రోజ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, కులగణన ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అని… అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నామన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. ఆ మాజీ మంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా అని ప్రశ్నించారు. అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల నుంచి తెలుసుకోవాలన్నారు. నిధులు కొరత – ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం వరకు తాము ఉన్నామన్నారు. మిగతా వాళ్ళ లెక్క ఎక్సక్యూటివ్ ఆదేశాలకే పరిమితం కామని.. అందుకే సభలో తీర్మానం పెట్టామన్నారు. ఫిబ్రవరి 16న చారిత్రాత్మక రోజని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement