Friday, July 26, 2024

TS: రాజ‌కీయ క‌క్ష్య‌తోనే రాజ ముద్ర మార్పు .. కేటీఆర్

కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న కాంగ్రెస్
చార్మినార్ ను తొల‌గించ‌డ‌మంటే హైద‌రాబాద్ ను అవ‌మానించ‌డ‌మే
తెలంగాణ చారిత్ర‌క చిహ్నాల‌ను ఎలా తొల‌గిస్తారు ?
కేసీఆర్ మార్కు క‌నిపించ‌కూడ‌ద‌నే మూర్ఖ‌పు నిర్ణ‌యాలు

చార్మినార్ గుర్తును స్టేట్ లోగో నుంచి తొల‌గించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని, రాజ‌కీయ క‌క్ష్య‌తోనే రాజ ముద్ర మార్పు చేయాల‌ని చూస్తున్నార‌ని ఇది సిగ్గుచేటని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో పలు రాచరిక గుర్తులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుర్తుల తొలగింపుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్దేశపూర్వకంగా కావాలనే రాజముద్రను కాంగ్రెస్ మార్చుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పేరు వినిపించకూడదన్నట్లుగా కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తెలంగాణ చారిత్రాక చిహ్నాలను తొలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. లోగోలో చార్మినార్‌ను తొలగించడమంటే హైదరాబాద్ ను అవమానించడమే అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలిగిస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

కేసీఆర్ మార్క్ కనిపించకూడదని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే రాజముద్రను మారుస్తున్నారని ఆరోపించారు. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని.. కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని సీరియస్ అయ్యారు. కేటీఆర్ వెంట సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, తాటికొండ రాజయ్యలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement