Friday, May 17, 2024

Alert | 35 అడుగులకు చేరనున్న గోదావరి నీటి మట్టం.. హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్​

భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద నీటిమట్టం ఇవ్వాల (బుధవారం) అర్ధరాత్రి వరకు దాదాపు 35 అడుగులకు చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. కాలేశ్వరం నుంచి 2.35లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోందని, ఇంద్రావతి నుంచి 2.15 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారని తెలిపారు. ఇక.. తాలిపేరు నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు వదలన్నారని, ఈ కారణంగా ఇవ్వాల అర్ధరాత్రి సమయానికి గోదావరిలో గణనీయంగా నీటి మట్టం పెరగనుందని అంచనా వేస్తున్నారు.

కాగా, వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, భద్రాచల పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి భద్రతా చర్యలపై సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement