Monday, April 15, 2024

Accident | పాద‌చారిపైకి దూసుకెళ్లిన ఇసుక లారీ.. గుర్తుప‌ట్ట‌లేనంత‌గా ఛిద్రమైన మృతదేహం

ములుగు జిల్లాలో ఘోరం జ‌రిగింది. వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న యువకుడి పైకి ఇసుక లారీ దూసుకెళ్ల‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మృతదేహం ఉంది. ఇసుక లారీ ఢీ కొట్టి వెళుతుండగా స్థానికులు ఆ లారీ ఆపేశారు. కాగా, మృతుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు. దీనికి సంబంధించి పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement