Monday, March 4, 2024

The End – తెలంగాణ ముగిసిన పోలింగ్ ….70శాతం పైగా ఓటింగ్

తెలంగాణ‌లో పోలింగ్ ముగిసింది.. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభ‌మై సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది..అయిదు గంట‌ల‌లోపు పోలింగ్ కేంద్రాల‌కు చేరుకున్న ఓట‌ర్ల‌కు అధికారులు ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. కాగా స‌మ‌స్యత్మాక 13నియోజ‌క‌వర్గాల‌లో సాయంత్రం నాలుగు గంట‌ల‌కే ముగిసింది.. కాగా మొత్తం 2290 మంది అభ్య‌ర్ధులు ఈ ఎన్నిక‌ల‌లో పోటీ చేశారు..మొత్తం ఓట‌ర్ల సంఖ్య 3 కోట్ల 26 ల‌క్ష‌ల 13వేల 205.. ఇక ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ మూడో తేదిన చేప‌డ‌తారు..

ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం 70 శాతం పైగా ఓటింగ్ న‌మోదైంది.. గ్రామీణ‌, సెబీ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో భారీ పోలింగ్ జ‌రిగింది.. విద్యాధికులు అధికంగా ఉన్న హైద‌రాబాద్ లో పోలింగ్ స‌ర‌ళి దారుణంగా ఉంది..2019 లో ఇక్క‌డ 50 శాతం ఓటింగ్ న‌మోదు కాగా, ఈసారి ఆ మార్క్ చేరుకోవ‌డం క‌ష్టంలో క‌నిపిస్తున్న‌ది. ఇది ఇలా ఉంటే 2019లో మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొత్తం 73శాతం పోలింగ్ జ‌రిగింది.. ఈసారి కూడా ఆ శాతానికి అటు ఇటుగా ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement