Tuesday, April 30, 2024

Khammam: 25ఏళ్లకు సరిపడే అభివృద్ది ఐదేళ్లలోనే పూర్తి .. మంత్రి పువ్వాడ

ఖమ్మం : 25ఏళ్లకు సరిపడే అభివృద్ది కేవలం గడచిన ఐదేళ్లలో పూర్తి చేయగలిగామని అది తెలంగాణ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో డీఎంఎఫ్ టీ, సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ది పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నగరాభివృద్దిలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు అవసరమయ్యే మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. డీఎంఎఫ్ టీ నిధులు రూ.90 లక్షలతో శంకుస్థాపన, సుడా నిధులు రూ.60లక్షలతో సైడ్ కాల్వలు, సీసీ రోడ్స్ నిర్మాణ పనులు మొత్తం రూ.1.50కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.

నగరంలోని 4వ డివిజన్ పాండురంగపురంలో డీఎంఎఫ్ టీ నిధులతో రూ.90లక్షలతో నిర్మించనున్న సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 45వ డివిజన్ మామిళ్లగూడెంలో సుడా నిధులు రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు & డ్రెయిన్ల ను ప్రారంభించారు. 50వ డివిజన్ బైపాస్ రోడ్డులో గల ఎస్సీ కాలనీలో సుడా నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు & డ్రెయిన్లను ప్రారంభోత్సవం చేశారు. 53వ డివిజన్ గట్టయ్యా సెంటర్ వద్ద బోడేపూడి స్థూపం దగ్గర సుడా నిధులు రూ.20లక్షలతో గట్టయ్య సెంటర్, 53వ డివిజన్ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, బుడిగెం శ్రీను, రాపర్తి శరత్, పగడాల శ్రీవిద్య, మున్సిపల్ ఏంఈ కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డీఈ స్వరూప రాణి, పగడాల నాగరాజు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement