Sunday, April 14, 2024

TS: ఇంటిని ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

తిరుమలగిరి, మార్చి 2 (ప్రభ న్యూస్) : అదుపుతప్పి ఇంటిని కారు ఢీకొట్టి ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ వయా జనగామ నుంచి విజయవాడ దైవదర్శనానికి కారులో నలుగురు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పాత గ్రామంలో బాబర్ ఐరన్ షాప్ సమీపంలో కారు అదుపుతప్పి పాత ఇంటిని ఢీకొట్టింది.

అందులో ప్రయాణిస్తున్న విక్రమ్, రమేష్ లకు తీవ్రగాయాలు కాగా.. వారిని ప్రైవేట్ అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, అందులో డ్రైవర్ మల్లారెడ్డి మరో వ్యక్తి ఉన్నారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉన్నవి..

Advertisement

తాజా వార్తలు

Advertisement