Tuesday, April 30, 2024

TS | అనుకోని అతిథి రాక… సొంతింటి బెంగ లేదిక!

అనుకోని అతిథిగా అక్కడ ప్రత్యక్షమైన మంత్రిని చూసి ఆ పూరిగుడిసెల వాసులు అవాక్కయ్యారు. వారి నోట మాటరాలేదు.. తేరుకునే లోపే.. మంత్రి జగదీషుడే కల్పించుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.. వారి కష్టాలు విన్నారు. ఆర్థిక ఇబ్బందులు కళ్లారా చూశారు… చలించిపోయారు. తక్షణం ఆ నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దూరజ్‌పల్లి శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందీ సంఘటన.

దురాజ్‌ పల్లి శివారులో జరిగిన ఇఫ్తార్‌ విందుకు ముఖ్య అతిధిగా మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి హాజరయ్యారు. కారు దిగుతూనే ఆ పక్కనే ఉన్న పూరి గుడిసెల వద్దకు వెళ్లారు. అనుకోని అతిథి నేరుగా తమ వద్దకే రావడంతో అక్కడ ఆ గుడిసెవాసులకు ఆశ్చర్యపోయారు. మంత్రి స్వయంగా కల్పించుకుని మరీ వారి వారి ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్‌ సామాను అమ్ముతూజీవనం సాగిస్తున్న వారి పేదరికాన్ని విని చలించి పోయిన మంత్రి జగదీష్‌ రెడ్డి వారికి ఇండ్ల నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అక్కడికక్కడే నిర్మాణానికి గాను రూ. 3 లక్షలు తక్షణమే మంజూరు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అనుకోని అతిధి దేవుడి రూపంలో ఇంటి ముందు ప్రత్యక్షం కావడమే ఒక వరమైతే …అడిగిన వెంటనే ఔదార్యం చూపడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇఫ్తార్‌ విందుకు మంత్రి హాజరు కావడమే తమకు మేలు చేసిందని.. ఆయన తోడ్పాటు-తో సొంతింటి కల సాకరమౌతున్నందుకు ఆనందంగా ఉందని లబ్దిదారులు ఆవుల అంజయ్య-శ్రావణి,ఆవుల లింగయ్య-చంద్రకళ దంపతులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement