Friday, May 17, 2024

Hyderabad: పెద్ద‌మ్మగుడిలో ఆ త‌ప్పు జ‌ర‌గ‌లేదు.. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుచేసిన పీజేఆర్​ కుమారుడు విష్ణు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్​ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాల (శనివారం) కంప్లెయింట్‌ చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో మైనర్పై అఘాయిత్యం జరిగిందని రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశార‌ని, ఆయనపై చర్యలు తీసుకోవాల‌ని ఆ ఫిర్యాదులో కోరారు. దేవాలయంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని విష్ణువర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో మైనర్పై అఘాయిత్యం జరిగిందన్న రేవంత్ మాటల్లో వాస్తవం లేదని విష్ణువర్థన్ రెడ్డి చెప్పారు.

రేవంత్ చెప్పిన మాటలు అక్షరాలా తప్పు అని అన్నారు. రెండు నెలల క్రితం జరిగిన ఓ ఇష్యూలో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్… దేవాలయంలో అఘాయిత్యం జరగలేదని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. దేవాలయంపై వాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయ ఫౌండర్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement