Saturday, July 13, 2024

TG – తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలి

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో భారీగా బదిలీలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత మంది ఐఏఎస్ లతోపాటు పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ మేరకు ఖమ్మం జిల్లాకు కలెక్టర్‌గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్‌ జిల్లాకు సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సందీప్ కుమార్ ఝా, కరీంనగర్‌ జిల్లాకు అనురాగ్ జయంతి, కామారెడ్డి జిల్లాకు ఆశీన్ సంగ్వన్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రాహుల్ శర్మ, నారాయణ పేట్ జిల్లాకు సక్తా పట్నాయక్, హనుమకొండ జిల్లాకు ప్రావిణ్య, జగిత్యాల జిల్లాకు సత్య ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లాకు విజియేంద్ర, మంచిర్యాల జిల్లాకు దీపక్, వికారాబాద్ జిల్లాకు ప్రతీక్ జైన్, నల్లగొండ జిల్లాకు నారాయణ రెడ్డి, వనపర్తి జిల్లాకు అదర్శ్ సురభి, వరంగల్ జిల్లాకు సత్య శారదా దేవి, ములుగు జిల్లాకు దివాకర్, నిర్మల్ జిల్లాకు అభిలాష అభినవ్‌ను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బదిలీ అయిన ఐఎఎస్ అధికారుల వివరాలు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement