Saturday, June 8, 2024

Telangana – జూన్ మూడో తేది నుంచి టెన్త్ స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌లు

టైం టేబుల్ విడుద‌ల చేసిన ఎస్ ఎస్ సి బోర్డు
రూ.50 ఫైన్ తో ప‌రీక్ష ఫీజు క‌ట్టే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.

పరీక్షల టైం టేబుల్‌..

- Advertisement -

జూన్‌ 3వ తేదీన తెలుగు, ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో కాంపోజిట్‌ కోర్సు-1, కాంపోజిట్‌ కోర్సు-2 పరీక్షలు
జూన్‌ 5వ తేదీన సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
జూన్‌ 6వ తేదీన ఇంగ్లిష్‌
జూన్‌ 7వ తేదీన గణితం
జూన్‌ 8వ తేదీన భౌతికశాస్త్రం
జూన్‌ 10వ తేదీన జీవశాస్త్రం
జూన్‌ 11వ తేదీన సాంఘికశాస్త్రం
జూన్‌ 12వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-1
జూన్‌ 13వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-2 పరీక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement