Saturday, July 13, 2024

Telangana – డీఎస్సీకి దరఖాస్తుల వెల్లువ.. జులై 17 నుంచి ఎగ్జామ్స్

తెలంగాణ డీఎస్సీకి భారీ స్థాయిలో దరఖాస్తులు వ‌చ్చాయి. మొత్తం 11,062 పోస్టుల భ‌ర్తీకి గాను 2,79,956 మంది అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు.. జూలై 17వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2,79,956 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే 2 లక్షల అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ పరీక్షలకు పోటీ పడే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అంచనా వేసింది. దీంతో డీఎస్సీ ఒక్కో పోస్టుకు సుమారు 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన వారు ఎస్ఏలోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

హైద‌రాబాద్ నుంచే అత్య‌థికం.

ఇక రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 మంది అభ్యర్థులు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండో స్థానంలో నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. నాన్లోకల్ కోటా(ఐదు శాతం) కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్లో పెద్ద ఎత్తున అప్లయ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడ అధికంగా దరఖాస్తులు అందాయని అధికారుల అంచనా. ఇక, అత్యంత తక్కువగా మేడ్చల్ జిల్లాలో 2,265 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న 23,919 మంది అభ్యర్థులు ఈసారి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకున్నట్లు కూడా అధికారులు వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement