Sunday, October 6, 2024

High Security :భ‌ద్ర‌త వ‌ల‌యంలో తెలంగాణ‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలింగ్ కు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘా నీడలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement