Wednesday, February 28, 2024

పేరుకే స్పా సెంటర్లు ..లోపలంతా వ్యభిచారామే…

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో స్పాలు, మసాజ్ సెంటర్లలో పోలీసులు మంగళవారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లను సీజ్ చేసి, నిర్వాహకులతో పాటు పలువురు విటులను అరెస్ట్ చేశారు. రెండు సెంటర్లలో మొత్తం 17 మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. అమాయక యువతులే టార్గెట్ గా డబ్బు ఆశ చూపి ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

మసాజ్ థెరపిస్టులు, బ్యూటీషియన్లు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తున్నారని చెప్పారు. ఆపై వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారని వివరించారు. దీనిపై పక్కా సమాచారంతో మంగళవారం దాడులు నిర్వహించగా రెండు సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement