Monday, March 4, 2024

Swearing Cermony – రేపు భాగ్యనగరంలో ట్రాఫిక్ అంక్షలు

హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు..

గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ ఆంక్షలతో వాహనాలు దారి మళ్లించడం ద్వారా రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్‌, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడళ్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

గురువారం ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా…

పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లింపు

.ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు.

బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లింపు.

సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement