Wednesday, May 1, 2024

Breaking | ఆదివారం ఆరోగ్య సేవలకు సెల‌వా?.. అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్

వరంగల్ జిల్లా నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలకు ఆదివారం సెల‌వు ప్ర‌క‌టించారా? అని ఆస్ప‌త్రికి వ‌చ్చిన వారు అడుగుతున్నారు. దీనికి సజీవ సాక్ష్యమే ఇక్క‌డున్న లైవ్ ఫొటోలు. నిరంత‌రం అందుబాటులో ఉంటామని చెప్పడం తప్ప.. వైద్యం అందించడం మాత్రం ఇక్క‌డ క‌ష్టంగా మారుతోంది. సెలవు దినాల్లో కొంత సమయం వైద్య సేవలు అందించాలని నియమం ఉన్నా ఉన్నతాధికారులతో ఉన్న ద‌గ్గ‌రి రిలేష‌న్‌ వల్ల అది కూడా చేయ‌డం లేదు.

ఎంతలా అంటే విధుల్లో ఉండాల్సిన వైద్యాధికారి సైతం ఆదివారం ఉద‌యం విధులకు హాజరు కాలేనంత ప‌రిస్థితి త‌లెత్తింది. సెలవు దినాల్లో ఉదయం 9నుండి 11వరకు విధుల్లో ఉంటామని చెప్పడమే తప్ప ఉన్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని సూపరిండెంట్ గోపాల్ ను వివరణ కోరగా అందరూ వీక్ అఫ్ లో ఉన్నట్లు, సెలవు దినం కాబ‌ట్టి నెమ్మదిగా వస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement