Friday, October 4, 2024

Bhadradri : రాములోరి కళ్యాణానికి… నేటి నుంచి స్పెషల్ టిక్కెట్లు..

ఈనెల 17న శ్రీరామ నవమి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరొందినరాములోరి ఆలయంలో రామయ్య కల్యాణోత్సవం జరగనుంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రతి ఏటా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక, ఈ దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టిక్కెట్లను ఆన్‌లైన్ కౌంటర్లలో విక్రయించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

రాములోరి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులకు ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగానే భక్తులకు రూ.7,500 నుంచి రూ. 150 టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రూ. 7500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 విలువైన టికెట్లు ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

నేరుగా ఇంటికే స్వామివారి తలంబ్రాలు..
రాములోరి కళ్యాణాన్ని దగ్గరున్నించి వీక్షించేందుకు ప్రత్యేక సెక్టార్లను కూడా ఏర్పాటు చేశారు. వీటికి కూడా టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటి ధరలు ఇలా ఉన్నాయి. రూ.10 వేలు, రూ.5 వేల టికెట్లను ఏర్పాటు చేశారు. ఈ టిక్కెట్లను ఏప్రిల్ 13 అంటే నేటి నుంచి విక్రయించున్నట్లు అధికారులు వివరించారు. ఈ టిక్కెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో విక్రయిస్తున్నారు. కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు అంటున్నారు.

ఇక, రాములోరి తలంబ్రాలను నేరుగా ఇంటికే పంపిస్తున్నట్లు ఆర్‌టీసి అధికారులు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వామివారి తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ ద్వారా ఏప్రిల్ 18వ తేది వరకు బుక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా కల్యాణ తలంబ్రాలు పంపే ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 15వ తేదిలోపు అంతరాలయ అర్చన-కల్యాణ తలంబ్రాలకు రూ.450 చెల్లించి బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఏప్రిల్ 16 లోపు ముత్యాల తలంబ్రాలకు రూ.150 చెల్లించి బుక్ చేసుకోవాలని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement