Saturday, May 4, 2024

HYD : బస్సు కింద పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం

ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ ఇంజినీర్‌గా ఆకుల సాయికృష్ణ (26) పనిచేస్తున్నాడు. బైక్‌పై డీఎల్ఎఫ్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక టైర్ల కిందపడ్డాడు.

ఈ ఘటనలో సాయికృష్ణ స్పాట్ లోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement