Friday, June 14, 2024

ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతికి ఎంపీ సంతోష్ కుమార్, హరిష్ రావు, బాల్క సుమన్ తదితరులు సంతాపం

ప్రముఖ గాయకుడు, రాష్ట్ర బిడ్డల సంస్థ చైర్మన్ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున నాగర్ కర్నూల్ జిల్లా కోరుకొండలో గుండెపోటుకు గురికాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. అప్పటికే సాయి చంద్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

కాగా, సాయిచంద్‌ ఆకస్మిక మృతిని తెలుకున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌.. కేర్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు

ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, , రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కళాకారులు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసి పరిధిలోని సాయిచంద్ గృహానికి చెందిన మత దేహం వద్ద నివాళులు అర్పించడంతోపాటు కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.

జీవిత చరిత్ర.

- Advertisement -

1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్‌ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement