Friday, May 3, 2024

Singareni – ఎఐటియుసికే సింగ‌రేణి కార్మికుల ప‌ట్టం… పోరాడి ఓడిన ఐఎన్ టియుసి..

సింగ‌రేణి – ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఎఐటియుసి సత్తా చాటింది. అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. కాంగ్రెస్ అనుంబంధ ఐఎన్ టియుసి పై దాదాపు 2 వేల ఓట్ల ఆధిక్యంతో ఎఐటియిసి గెలుపొందింది. దాంతో.. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎఐటియుసి విర్భవించింది. సింగరేణిలో మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయిసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌లోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఎఐటియుసి విజయం సాధించింది.

కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో, రామగుండం రీజియన్‌లోని రామగుండం-3లో ఐఎన్ టియుసి గెలుపొందింది.

సింగరేణి ఎన్నికల్లో ఈ రెండు సంఘాలు హోరాహోరీగా తలపడ్డాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం-1, 2లో ఎఐటియుసి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే అత్యధిక ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నిగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్‌, రామగుండం-3, భూపాలపల్లిలో ఎఐటియుసి పై ఐఎన్ టియుసిపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. మరోవైపు.. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్‌ఎస్‌ అనుబంధ టిబిజికెసి ఈసారి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement