Wednesday, May 1, 2024

Siddipet – పొలిటిక‌ల్ లీడ‌ర్స్ … మీ వ‌ద్ద ఉన్న వెప‌న్స్ డిపాజిట్ చేయండి…సిపి శ్వేత

సిద్దిపేట – పొలిటికల్​ లీడర్స్​ తమ ప్రొటెక్షన్​ కోసం తీసుకున్న వెపన్స్​ని ఆయా స్టేషన్లలో డిపాజిట్​ చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16లోపు పీఎస్​లలో వెపన్స్​ డిపాజిట్​ చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలుంటాయని తెలిపారు. ఇక.. డిసెంబర్​ 10 తర్వాత డిపాజిట్​ చేసిన వెపన్స్​ని తిరిగి తీసుకోవచ్చని సూచించారు.
పారదర్శకంగా విష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ గురించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌న్నారు. . ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ప్రజలు ప్రజా ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లాలో బార్డర్ పోలీస్ స్టేషన్లలో 10 చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింద‌ని, 24X7 వాహనాలు తనిఖీ నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు..

జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వివరాలు

  1. జక్కాపూర్ చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధి.
  2. దేవక్కపల్లి బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధి.
  3. వంటిమామిడి ములుగు పోలీస్ స్టేషన్ పరిధి.
  4. భూంపల్లి ఎక్స్ రోడ్ భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి.
  5. బేగంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా
  6. జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా
  7. లద్దునూర్ గ్రామ శివారు మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధి.
  8. ముస్త్యాల విలేజ్ చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధి
  9. జిల్లెల్ల గడ్డ చౌరస్తా
  10. అక్కన్నపేట గ్రామ శివారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement