Monday, April 15, 2024

మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. పార్టీ లైన్ ను దాటలేదన్న కాంగ్రెస్ నేత

ఎఐసీసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఈరోజు షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మహేశ్వర్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం నోటీసు పంపింది. గంటలోపుగా వివరణ ఇవ్వాలని నోటీస్ జారీ చేసింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. అయితే మహేశ్వర్ రెడ్డి షోకాజ్ నోటీసు పై స్పందిస్తూ.. తాను పార్టీ లైన్ ను దాటలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement