Sunday, April 28, 2024

Shock To BRS – పార్టీకి మాజీ డిప్యూటీ సిఎం తాడికొండ రాజ‌య్య రాజీనామా

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ పార్టీకి నేడు భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కాగా, గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. వ‌రంగ‌ల్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీకి అవ‌కాశం ఇవ్వాల‌ని ఇటీవ‌లే బిఆర్ఎస్ అధిష్టానాన్ని ఇటీవ‌లే కోరారు. అయితే అటువైపు నుంచి సాన‌కూల స్పంద‌న రాకపోవ‌డంతో పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. కాంగ్రెస్ గూటిలోకి చేరేందుకు ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.

కాగా,. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆయన రాజీనామాతో వరంగల్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.  ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీలో తాను అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని చెప్పారు. పార్టీకి ఎంతో సేవ చేసినా తనకు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో ఆత్మ క్షోభకు గురయ్యానని చెప్పారు. పార్టీ అధినేతను కలిసే అవకాశం కూడా తనకు రాలేదని విమర్శించారు. పార్టీ మారే విషయంపై తన అనుచరుల నుంచి తనకు ఎంతో ఒత్తిడి ఉందని చెప్పారు. 

బీఆర్ఎస్ పార్టీ విధానాలు కూడా తనకు నచ్చడం లేదని రాజయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సరికాదని చెప్పారు. గతంలో తాను 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని… కాంగ్రెస్ లో ఉండే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడానని తెలిపారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement