Saturday, May 25, 2024

Followup: రెబ్బెన ఎస్సైపై లైంగిక ఆరోపణలు.. ఎస్పీ ఆఫీసుకు బదిలీ చేస్తూ ఆదేశాలు

తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు అయిన కొద్ది రోజులకే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న భవానీ సేన్ గౌడ్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, బాధితురాలు నిన్న (జులై 12 మంగళవారం) ఎస్‌ఐని దూషిస్తూ ఆన్‌లైన్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. వీడియోలో ఆ ఎస్​ఐ తనను ఇంటికి రావాలని పదే పదే అడిగేవాడని, తనకు కొన్ని పాఠ్యపుస్తకాలు ఇస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అయితే తను మొదట నిరాకరించినప్పటికీ, ఆ మరుసటి రోజు అతని ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

ఇక.. తన ఇంట్లో ఎస్​ఐ ఆమెను సెక్స్ గురించి అభిప్రాయాన్ని అడిగాడని, అంతేకాకుండా ఆమె ఎత్తు, బరువును తనిఖీ చేసే నెపంతో అనుచితమైన రీతిలో తాకరాని చోట్ల తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఎస్​ఐ గౌడ్ తనపై అనేక సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు వీడియోలో పేర్కొంది. అతను నిరంతరం తనకు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించాడని ఆరోపించింది. దీనిపై విచారణ ప్రారంభించి పోలీసు శాఖ ఇవ్వాల ఎస్​ఐ భవానీ సేన్​ గౌడ్​ని సూపరింటెండెంట్‌ కార్యాలయానికి బదిలీ చేసినట్లు సమాచారం. కాగా, గతంలో కూడా భవానీసేన్​పై​ రెండుసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement