Friday, April 19, 2024

Seize – 30 టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి అక్రమంగా 30 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని మానకొండూరు పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ నుండి ఏంహెచ్ 27 బిఎక్స్ 8198 నెంబర్ గల లారీలో 30 టన్నుల రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు మానకొండూర్ సీఐ మాదాసు రాజ్ కుమార్ తెలిపారు.

వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చెందిన సంతోష్ , మహారాష్ట్రలోని అమరావతికి చెందిన( లారీ ఓనర్ & డ్రైవర్) షేక్ అన్వర్, మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన (లారీ క్లీనర్ ) గణేష్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మాదాసు రాజకుమార్ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలింపులో వరంగల్ కు చెందిన నరేష్ అనే వ్యక్తి ముఖ్య పాత్ర ఉన్నట్లు సీఐ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement