Saturday, June 22, 2024

Jatara – వస్తున్నాం లింగమయ్యా – రేపటి నుండే సళేశ్వరం జాతర ప్రారంభం

మూడు రోజులు మాత్రమే అనుమతి
వన్యప్రాణుల సంరక్షణకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు
మే నుంచి భ‌క్తుల సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి
వివ‌రాలు వెల్ల‌డించిన డీఎఫ్‌ఓ రోహిత్‌ గోపిడి

ఆంధ్రప్రభ, అచ్చంపేట: వ‌స్తున్నాం లింగ‌మ‌య్యా అంటూ పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లిరానున్నారు. రేప‌టి నుంచి మూడు రోజుల‌పాటు న‌ల్ల‌మ‌ల అభ‌యార‌ణ్యంలోని స‌ళేశ్వ‌రం జాత‌ర జ‌ర‌గ‌నుంది. అయితే.. గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాత‌ర‌కు మూడు రోజులు మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్న‌ట్టు నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధికారి రోహిత్‌ గోపిడి శనివారం చెప్పారు ఎన్నికల కోడ్‌ దృష్ట్యా పోలీసు, హెల్త్‌, ఇతరత్రా శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మూడు రోజులు పాటు మాత్రమే జాతరకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజితో నిత్యం సందర్శనకు అనుమతి

- Advertisement -


ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి, పుణ్యక్షేత్రముగా ప్రసిద్ది గాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారే అనుమ‌తి ఇస్తున్నారు. అయితే.. ఏపీ, తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. దీంతో గుండంలో ఆక్సిజన్ లెవ‌ల్స్ త‌గ్గి ప్రాణనష్టం సంభ‌విస్తోంది. ఇక నుంచి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా మే నెల నుంచి 9 నెలల పాటు రోజుకు 100 మందికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అనుమతిని ఇస్తామ‌ని డీఎఫ్‌వో తెలిపారు. ఈ ప్యాకేజీలో స్థానిక చెంచులకు ఉపాధి కల్పించడం ద్వారా వారే ప్రత్యేక వాహనాల్లో సలేశ్వరం వరకు తీసుకెళ్లి దగ్గర ఉండి దర్శనం చేయిస్తార‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement