Saturday, May 18, 2024

All Artificial – నివాళిలో నిజాయితీ ఎక్క‌డ – కెసిఆర్ ని ప్ర‌శ్నించిన రేవంత్

హైద‌రాబాద్ – అమరవీరులకు కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా చివరి రోజు అమరవీరుల సంస్మరణసభలో ఆ కుటుంబాలకు సత్కారాల నుండి ఎలక్ట్రానిక్ కొవ్వొత్తుల ప్రదర్శన వరకు నిజాయితీ కొరవడిందని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతేకాదు ఎందరో ద్రోహులను అందలం ఎక్కించిన కేసీఆర్ నిన్న అమరవీరుల కుటుంబాల కోసం ఒక్క ఎమ్మెల్సీ పదవైనా ప్రకటిస్తాడేమోనని తెలంగాణ ఆశించింది అని రేవంత్ పేర్కొన్నారు. అయితే అటువంటి ఆశ‌లు ఏవీ నెర‌వేర‌లేద‌ని వ్యాఖ్యానించారు.

ఇక మరో ట్వీట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర అంటే గెలిచిన వాడిది కాదు. త్యాగం చేసిన వాడిదని..అమర వీరుల స్థూపంపై ఆ త్యాగధనుల పేర్లు రాయనప్పుడు, శిలాఫలకాలపై కేసీఆర్ పేరు మాత్రం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. అమరుల చరిత్రను సమిధ చేసి కల్వకుంట్ల చరిత్ర మాత్రమే తెలంగాణ చరిత్ర అన్నట్టు భ్రమింపజేసే కుట్ర ఇది అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement