Tuesday, October 8, 2024

RR: రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు

బొంరాస్ పేట్, ఆగస్టు 28 (ప్రభ న్యూస్) : వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్ల గ్రామం జాతీయ రహదారి 163పై ఇవాళ ఉదయం 10 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిగి నుండి కొడంగల్ వెళ్తున్న సంయోద్దీన్ (33), జంటుపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న మోహిజ్ రఫీ (27) ఇద్దరు యువకుల బైక్ లు తుంకి మెట్ల సమీపంలో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement