Sunday, April 28, 2024

TS : స్ట్రాంగ్ రూంలోకి ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు …

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు,వీవీ ప్యాడ్స్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని మినీ స్టేడియంకు చేరుకున్నాయి. పోలీస్ సెక్యూరిటీ మధ్య ప్రత్యేక వాహనంలో 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368 వీవీ ప్యాడ్స్, 328 కంట్రోల్ యూనిట్స్ తీసుకొచ్చారు అధికారులు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవిఏం మిషన్లు పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు కూడా స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

- Advertisement -

ప్రత్యేక వాహనంలో పోలీసు సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు, వీవీ ప్యాట్లు షాద్ నగర్ కి చేరుకున్నాయి. షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవ రావు, ఫరూక్ నగర్ మండలం రెవిన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368వీవీ ప్యాట్లు,328 కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు.

సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక కేంద్ర బలగాల మధ్య రక్షణ స్ట్రాంగ్ రూములకు ఏర్పాటు చేశారు.స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్ చేశారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాట్లును ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. గట్టి పోలీసు భద్రత, సాంకేతిక నిఘా పర్యవేక్షణలో ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉంటాయన్నారు. 24 గంటలు స్ట్రాంగ్ రూములకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement