Thursday, July 25, 2024

ప్రతి పోలీసు బాధ్యతగా మెలగాలి : ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్, ఆగస్ట్ 5 (ప్రభ న్యూస్) : యూనిఫారం వేసుకున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి హోంగార్డ్ అధికారి నుండి సీనియర్ అధికారి వరకు క్రమశిక్షణతో ఉండాలని ఎస్‌పి కోటి రెడ్డి అన్నారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పరేడ్ లో ఆయన మాట్లాడుతూ… మన ముందు చట్టవిరుద్ధ సంఘటనలు ఏమైనా జరిగేటప్పుడు పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నా లేకున్నా వెంటనే స్పందించాలన్నారు. ఎస్‌పి. కోటిరెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన వీక్లీ పరేడ్ లో పాల్గొని పరేడ్ ను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ… విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా తప్పనిసరిగా జిల్లాలోని ప్రతి పోలీస్ అధికారి పరేడ్ లో పాల్గొనాలన్నారు. బందోబస్తులో ఉన్న, వాతావరణం అనుకూలించకపోయిన పరేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పరేడ్ లో పాల్గొనే విధంగా చొరవ తీసుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీస్ అధికారులు తమ వద్దకు వచ్చే ఫిర్యాదుదారులతో, ఏ‌ఆర్ పోలీస్ అధికారులు ఖైదీలను కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో కానీ, గన్ మెన్ అధికారులు విఐపిలకు సెక్యూరిటి ఇచ్చే సమయంలో క్రమశిక్షణతో, అప్రమత్తతతో, హుందాతనంతో, సమయస్ఫూర్తిగా విధుల్లో పాల్గొనాలన్నారు. వికారాబాద్ సబ్ డివిజన్, ఎ.ఆర్ పోలీస్ అధికారులు వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో, తాండూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు తాండూర్ లో, పరిగి పోలీస్ అధికారులు పరిగిలో దాదాపు మొత్తం 350 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది వీక్లీ పరేడ్ లో పాల్గొనడం జరిగింది. ఈకార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ నర్సింహులు, ఏ‌ఆర్ డీఎస్పీ వీరేశం, ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వికారాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, వికారాబాద్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది, క్యూ‌ఆర్‌టి పోలీస్ సిబ్బంది, హోం గార్డ్స్ అధికారులు, డాగ్ స్క్వాడ్ అధికారులు మొత్తం 162 మంది అధికారులు ఈ పరేడ్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement