Tuesday, April 30, 2024

TS | హైద‌రాబాద్ ఎయిర్​పోర్టులో కస్టమ్స్​ తనిఖీలు.. బంగారం, విదేశీ సిగరెట్ల పట్టివేత

శంషాబాద్ (ప్రభాన్యూస్): హైదరాబాద్​లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాల నుంచి బంగారం, సిగరెట్లు తీసుకొస్తున్న వ్యక్తులు పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేయగా మూడు వేరు వేరు ఘటనల్లో విదేశీ సిగరెట్లతో పాటు అక్రమ బంగారం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద పెద్దమొత్తంలో బంగారంతో పాటు విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మొదటి కేసులో దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 1399 గ్రాముల బంగారం తరలించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. రెండవ కేసులో జెడ్డా నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 526 గ్రాముల బంగారం తరలిస్తుండగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులకు బుక్కయ్యాడు. మూడు కేసులో మరో ప్రయాణికుడు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వస్తుండగా 62.400 విదేశీ సిగరెట్లు తరలించేందుకు యత్నించి కస్టమ్స్ అధికారులకు దొరికి పోయాడు.

మొత్తం రెండు కేసుల్లో 1.93 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. బ్యాంకాక్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 1.17 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement