Friday, May 31, 2024

RR: ఎంపీ రంజిత్ రెడ్డి స‌మ‌క్షంలో చేవెళ్ల జ‌డ్పీటీసీ కాంగ్రెస్ లో చేరిక..

(ప్రభ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో) : బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. చేవెళ్ల జడ్పీటీసీ మాలతి ఆ పార్టీకి రాజీనామ చేసారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం చేవెళ్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. అంతకు ముందే జడ్పీటీసీ మాలతి ఆ పార్టీకి దూరమయ్యారు. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ ఆధ్వర్యంలో.. చేవెళ్ల మండల జ‌డ్పీటీసీ మాలతితో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎం జంగయ్య, పి దయాకర్, ఏం సాయి రెడ్డి ఏ కృష్ణారెడ్డి, తదితరులు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు పలుగుట్ట జనార్దన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీటీసీ సభ్యులు వసంతం, చేవెళ్ల సర్పంచ్ శైలజ అగ్గి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, ప్రతాపరెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మండల కార్యదర్శి గుండాల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement