Monday, April 29, 2024

TS : ప్రారంభమైన పల్స్ పోలియో..

నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ డే’ను పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హెల్త్‌ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలతో సహా పర్యాటక ప్రాంతాలు, బస్టాండ్లు, విమానాశ్రయంలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు చుక్కలు వేస్తారు.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో రాత్రి 8 గంటల వరకు పల్స్‌ పోలియో చుక్కలు వేస్తారు. మార్చి 3న పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన పిల్లల వివరాల్ని తీసుకుని.. 4, 5 తేదీల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేయనున్నారు. ఒక్క నిమిషంలో పల్స్‌ పోలియో చుక్కలు వేసేస్తారు. కాబట్టి అధికారుల కోసం ఎదురుచూడకుండా.. మీ పిల్లల కోసం ఒక్క నిమిషం కేటాయిస్తే సరిపోతుంది. పిల్లలకు పోలియో చుక్కలు వేశాక.. రెండు రోజులపాటూ కొంత ఇబ్బంది పడతారు. అది చూసి తల్లిదండ్రులు టెన్షన్ పడవద్దని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమంపై అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement