Sunday, June 9, 2024

TS : లోక్‌స‌భ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి … డీజీపీ ర‌విగుప్తా

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని డీజీపీ ర‌విగుప్తా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

లోక్‌సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్‌ ఫోర్స్‌ విభాగాలు సహా.. 164 సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసాం…7 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేసామని పేర్కొన్నారు. 89 ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ‌ని, రూ.186కోట్ల విలువచేసే మద్యం, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశామ‌ని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసామని డీజీపీ రవి గుప్త వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement