Thursday, April 25, 2024

వివిద పథకాల లబ్దిదారులకు స్పీకర్ పోచారం చెక్కుల పంపిణీ

కోటగిరి మార్చ్ 16(ప్రభ న్యూస్): మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం రోజున హాజరై యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ఒక్క నియోజక వర్గానికి మంజూరు చేయని,11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఉమ్మడి కోటగిరి, పోతంగల్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన టు బి హెచ్ ఇండ్ల లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా సుమారు రూ”లు 4.5 కోట్ల బిల్లులను ఆన్లైన్,నగదు, చెక్కుల రూపంలో పంపిణీ చేశారు.

. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసుకోవడం జరిగింద న్నారు.మరోమారు సీఎం కేసీఆర్ సహకారంతో సుమారు 4వెల ఇండ్లు బాన్సువాడ నియోజక వర్గానికి మంజూరు కానున్నాయని అన్నారు. సొంత స్థలం ఉన్న వారికి త్వరలో 3 లక్షల పథకం ద్వారా సింగిల్ బెడ్ రూమ్ నిర్మించుకునే పథకం ప్రారంభం కాబోతుందన్నారు.ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు మూడు విడుతలుగా నేరుగా లబ్ధిదారుని ఖాతాలలో నగదు 1లక్ష రూ”లు జమ హై తుందన్నారు.రైతుల కోరిక మేరకు మరో విడత నిజాంసాగర్ నీటిని సరఫరా చేస్తామన్నారు.

యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులు సిద్ధం చేయాలని వారికి సూచించారు. మద్నూర్ నుండి వయా పోతంగల్,కోటగిరి,రుద్రూర్ బోధన్ వరకు నేషనల్ హైవే మంజూరు కావడం త్వర లో ఈ హైవే పనులు కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.అనంతరం ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గ్రామ సమన్వయ కమిటీ సభ్యులతో స్పీకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇప్పటివరకు మండలానికి మంజూరైన నిధులపై జరుగుతున్న అభివృద్ధి పనుల విషయాలు,త్వరలో ప్రారంభమయ్యే సింగల్ బెడ్రూం పథకం,జీప్లస్ టు ఇండ్ల నిర్మాణం గూర్చి కమిటీ సభ్యుతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్,హౌసింగ్ డీ.ఈ నాగేశ్వర్ రావు,జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు సీరాజుద్దిన్,ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్,సర్పంచ్ ఫోరం మండల కన్వీనర్ పత్తి లక్ష్మణ్,మండల బిఅర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు, విలేజ్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కులకర్ణి ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలుఅధికారులు,సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement