Sunday, May 19, 2024

Pink Wave – తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్ – హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించడం ఖాయం – కవిత

హైదరాబాద్‌ : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హ్యట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్ర సృష్టించనున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పింక్ వేవ్ కనిపించిందని పేర్కొన్నారు

పెద్దమ్మ తల్లి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమాల గడ్డని, చైతన్యవంతమైన ప్రజలు ఉండడం వల్లే ప్రజలకు మేలు చేసే ప్రతినిధులు ఉండాలని ప్రజలు నిర్ణయించినట్లు అర్థమవుతోందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి తమకు అందుతున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు

పోలింగ్ శాతం ఎంత ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గెలుపు తధ్యమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే సంబరాలు జరుపుకుంటున్నామని, ఎమ్మెల్యేలు గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారని అన్నారు. ప్రజలను తప్పదోవ పట్టించడానికి అనేక ఫేక్ సర్వేలు వస్తుంటాయని, గత ఎన్నికల్లోనూ ఇలానే జరిగిందని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement