Friday, May 17, 2024

TS: పేషేంట్ ను ఎలుక‌లు కొరికితే డాక్డ‌ర్స్ కి శిక్షా…..నిర‌స‌న‌కు దిగిన సిబ్బంది….

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎలుకల దాడుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి ఆస్పత్రి వైద్యుల సస్పెన్షన్ పై నిరసనలు చేపట్టారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ . ఎలుకలు పేషంట్స్ నీ కొరికితే వైద్యులను ఎందుకు బలి చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

శానిటేషన్ సిబ్బంది పై కాకుండా వైద్యులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల మెడికల్ కాలేజీలు నిర్మాణం కన్నా ముందే షెడ్ లల్లో మెడికల్ కాలేజీ లను ప్రారంభించారని తెలిపారు. వంద పడకలున్న జిల్లా ఆస్పత్రి నీ మెడికల్ కాలేజీ చేశారని అన్నారు. వంద మందికి సరిపడా శానిటేషన్ స్టాఫ్ ఉన్నార‌న్నారు. ఇప్పుడు హాస్పటల్ లో బెడ్స్ సంఖ్య 350 కి పెంచారని తెలిపార‌న్నారు. గత ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నయని వైద్యులు మండిపడుతున్నార‌న్నారు. ఇవ్వాళ ఆరోగ్య శాఖ మంత్రి తో ప్రభుత్వ వైద్యుల చర్చలు ఉన్నాయని తెలిపారు. అయితే వెంటనే డాక్టర్ల పై విధించిన సస్పెన్షన్ నీ ఎత్తివేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement