Monday, April 29, 2024

Breaking: మరోసారి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం…

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో మరోసారి సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్న సందర్భంలో సిర్పూర్ లో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య రావడంతో పైలట్ చాపర్ నిలిపివేశాడు. దీంతో సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో ఆసిఫాబాద్ కు బయల్దేరారు.

ఈనెల 6వ తేదీన కూడా సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆరోజు సీఎం పర్యటనలో భాగంగా దేవరకద్రకు వెళ్తుండగా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. పైలట్ అప్రమత్తం కావడంతో ఫామ్ హౌస్ లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ను సిద్ధం చేయడంతో సమస్య పరిష్కారమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement