Wednesday, May 1, 2024

TS Constable: తెలంగాణ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి..

తెలంగాణలో కానిస్టేబుళ్ల నియామకం పై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. దీంతో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు మార్గం సుగమమయ్యింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ప్రశ్నాపత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రశ్నల తప్పిదాలపై స్వతంత్ర నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement