Monday, April 29, 2024

TS : మేడారంలో శివసత్తుల సందడి…

మేడారం బృందం: బుధవారం సారలమ్మ రానున్న నేపథ్యంలో భక్తుల సందడితో రోడ్లన్నీ జనమయంతో నిండిపోయాయి.ఎటు వైపు చూసిన భక్తజనంతో మేడారం ప్రాంతం కిటకిటలాడుతోంది.శివసత్తుల పూనకలతో సందడి వాతావరణం నెలకొన్నది.వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు తప్పిపోకుండా జెండా కర్రలతో సమూహంగా తల్లుల దర్శనానికి వస్తున్నారు.ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

శివసత్తుల సందడి…
మేడారంలో జంపన్న వాగు లో శివసత్తుల పునకాలతో సందడి వాతావరణం నెలకొంది. ఒక దిక్కు భక్తుల రద్దీ మరో వైపు శివసత్తుల సందడి తో మేడారం అంతటా కోలాహలంగా మారింది. జంపన్న వాగు లో శివసత్తుల పూనకాలతో భక్తులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు పరవసించి పోయారు. జంపన్న వాగు పొడువన శివ సత్తులు,భక్తజనంతో మొత్తం నిండిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement