Friday, February 23, 2024

TS | తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతం.. డీజీపీని ప్రశంసించిన నోబెల్​ గ్రహీత కైలాష్​ సత్యార్థి

ప్రముఖ సామాజిక కార్యకర్త, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇవ్వాల (శనివారం) తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను కలిశారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. పిల్లల అక్రమ రవాణా, ఇతర సంబంధిత నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల చొరవ గణనీయమైన ఫలితాలను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు ద్వారా బాలల హక్కుల పరిరక్షణలో డీజీపీ అంజనీ కుమార్ కృషిని, ఇటుక బట్టీల నుండి బాల కార్మికులను విముక్తి కల్పించడానికి.. వలస వచ్చిన ఒడిశా పిల్లల కోసం ఒరియా భాషలో వర్క్ సైట్ పాఠశాలలను ప్రారంభించడంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, CID మహేష్ భగవత్ ప్రయత్నాలను సత్యార్థి ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement