Tuesday, October 15, 2024

NZB: సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆగదు..

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్) ; నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రద్దానంద్ గంజ్ లో వ్యాపార కేంద్రమైన ప్రాంతంలో గల రైల్వే గేట్ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆగదని చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు, సీనియర్ రాజకీయ నాయకులు గడ్డం భక్తవత్సలం నాయుడు, రైల్వే గేట్ పరిరక్షణ సమితి నాయకులు కోనేరు సాయికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గంజి ప్రాంతంలో రైల్వే గేట్ అధిక సమయం మూసి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైల్వే గేట్ పరిరక్షణ సమితి సభ్యులు, స్థానికులు వ్యాపారులు ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతిరోజు సుమారు 12 నుంచి 18 గంటల వరకు ఈ రైల్వే గేట్ మూసి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు వెంటనే స్పందించి ఈ రైల్వే గేట్ సమస్యను పరిష్కరించాలని ముక్తకంఠంతో కోరారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్, బాబు, అబ్దుల్ మజీద్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement